ప్రచురణ తేదీ : Jan 21, 2017 10:30 PM IST

నాగార్జున సినిమా టైటిల్ పై వివాదం !!

om-namo-venkateshaya
అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు కలయికలో రూపొందుతున్న భక్తి రస చిత్రం ”ఓంనమో వెంకటేశాయ”. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ పెద్ద వివాదం తలెత్తింది. ఆ వివరాల్లోకి వెళితే వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హథీరాం బాబా జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. హథీరాం బాబా పేరుతొ రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఓం నమో వెంకటేశాయ’ అనే టైటిల్ కాకుండా హథీరాం బావాజీ అనే టైటిల్ పెట్టాలంటూ .. గిరిజన సేవ సంఘం ఆధ్వర్యంలో తిరుపతి లో ధర్నా జరిగింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ గిరిజన సేవ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. గిరిజన సేవ సంగం నాయకుడు డిమాండ్ చేస్తూ .. అన్నమయ్య కథతో తీసిన సినిమాకు అన్నమయ్య అని, రామదాసు కథతో వచ్చిన సినిమాకు రామదాసు అని టైటిల్ పెట్టినప్పుడు హథీరాం బాబాజీ జీవిత కథతో వస్తున్నా ఈ సినిమాకు టైటిల్ కూడా హథీరాం బాబాజీ అని టైటిల్ పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పనిసరిగ్గా టైటిల్ మార్చాల్సిందే అని అన్నారు. మరి ఈ విషయం పై దర్శక నిర్మాతలు ఏమంటారో చూడాలి !!

Comments