ప్రచురణ తేదీ : Sep 1, 2018 11:05 AM IST

నేటినుండి షూటింగ్ లో బిజీ అవుతున్న ఎన్టీఆర్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ రోజు నుండి తాను నటిస్తున్న అరవింద సమేత షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇటీవలే అయన తండ్రి నందమూరి హరికృష్ణ మృతితో వారి కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. తండ్రి అంటే ఎంతగానో ఇష్టపడే ఎన్టీఆర్ ఈ విషాదం నుండి ఎప్పుడు తేరుకుంటాడో తెలియదు కానీ నిర్మాత నష్టపోకుండా ఉండేందుకు అయన తిరిగి ఈ రోజు నుండి షూటింగ్ లో పాల్గొననున్నాడు. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆకస్మిక మృతితో షూటింగ్ ని నిలిపివేశారు. అన్న ఎన్టీఆర్, హరికృష్ణ లకు పని పట్ల ఎంత గౌరవం ఉండేది. వాళ్ళ డెడికేషన్ గురించి ఇప్పటికి చాలా మంది మాట్లాడుకుంటారు .. ఇప్పుడు వారి వారసత్వ పరంపర తనయుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు వచ్చేసింది. అటు కళ్యాణ్ రామ్ కూడా గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ఈ రోజు నుండి పాల్గొననున్నాడట.

Comments