ప్రచురణ తేదీ : Dec 3, 2017 10:54 AM IST

వైరల్ న్యూస్..ఎన్టీఆర్ తో రాజమౌళి ప్రయోగం..?

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుతోందని, ఇందులో చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారనే వార్త ఇప్పిటికే ఇండస్ట్రీ వార్తల్లో సంచలనంగా మారింది. దీనికి సంబందించిన ఈ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానులు దానిని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుస్తున్నారు. తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి పాత్రలని రాజమౌళి అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. మెగా నందమూరి అభిమానులని దృష్టిలో పెట్టుకుని వారి పాత్రలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడట. కాగా ఎన్టీఆర్ అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సరిపోతాడని రాజమౌళి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా దీనిని సెట్స్ పైకి వెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తరువాత రాజమౌళి ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి దర్శత్వంలో నటించి ఉన్నారు.

Comments