ప్రచురణ తేదీ : Oct 13, 2017 9:56 AM IST

యూరప్ టూర్ కి సిద్దమైన.. ఎన్టీఆర్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి జోష్ మీదున్నాడు. ఓ వైపు మూడు పాత్రల్లో అయన నటించిన జై లవకుశ సంచలన విజయం అందుకోవడంతో పాటు మరో వైపు మొదటి సారి టివి షో కి వ్యాఖ్యాతగా చేసిన బిగ్ బాస్ షో కూడా మంచి సక్సెస్ సాధించింది. అందుకే ఈ ఖుషీలో అయన ఫ్యామిలీ తో కలిసి యూరప్ టూర్ వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేసే సినిమా జనవరిలో మొదలు కానుంది కాబట్టి, ఈ రెండు నెలల సమయం ఖాళీగా ఉండడంతో అయన నెలరోజుల పాటు యూరోప్ లోనే హాలిడేస్ ని ఎంజాయ్ చేయనున్నాడు. ఈ రెండు రోజుల్లో అయన ప్రయాణం మొదలు కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా భారీ వసూళ్ల దిశగా సాగిపోతుంది. ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో 3వ స్థానంలోకి చేరిన ఈ సినిమా రెండో స్థానానికి చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టేలా లేదు. పైగా మహేష్ నటించిన స్పైడర్ సినిమా నెగిటివ్ టాక్ రావడం జై లవకుశ కు కలిసి వచ్చిందని చెప్పాలి. మొత్తానికి ఎన్టీఆర్ ఫుల్ జోష్ ని అలాగే కంటిన్యూ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

Comments