ప్రచురణ తేదీ : Tue, Dec 5th, 2017

యూరప్ ట్రిప్ బయలుదేరిన ఎన్టీఆర్ .. ఈ నెలంతా అక్కడే ?

వరుస విజయాలతో దూకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ యూరప్ ట్రిప్ కు బయలు దేరాడు. తాజాగా జై లవకుశ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయాల్సి ఉంది .. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి ..జనవరి నుండి ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులు సరదగా గడపాలని ఫామిలీ తో కలిసి యూరప్ ఈ రోజు ఉదయమే బయలుదేరి వెళ్ళాడు. నిజానికి గత నెలలోనే వెళ్లాల్సి ఉండగా ఎన్టీఆర్ తనయుడు అభయ్ కి వీసా సమస్య వల్ల కుదరలేదు .. ఇప్పుడు అన్ని సమస్యలు సాల్వ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి యూరప్ చెక్కేసాడు . ఈ నెలమొత్తం అక్కడే ఉంటాడట. ఇక సంక్రాంతి తరువాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Comments