ప్రచురణ తేదీ : Sep 7, 2018 3:15 PM IST

అరవింద పాటలకు ముహూర్తం కుదిరింది ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ రేగులర్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. దసరా సందర్బంగా వచ్చే నెల 11న ఈ సినిమాను విడుదల చేస్తుండగా పాటల వేడుకను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముక్యంగా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా కోసం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్ లోనే విడుదల చేస్తారట.

Comments