ప్రచురణ తేదీ : Sun, Oct 8th, 2017

క్షుద్ర పూజకి ఎన్ ఆర్ ఐ బలి! దక్షిణాఫ్రికాలో ఘటన!

విదేశాల్లో అప్పుడప్పుడు భారతీయులపై ఏదో ఒక విధంగా దాడులు చేయడం, చంపడం వంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే దక్షిణాఫ్రికాలో క్షుద్ర పోజలు చేసి ఓ వ్యక్తి భారత సంతతి మహిళని దారుణంగా నరికి చంపినా ఘటన 2014లో చోటు చేసుకుంది. ఆ కేసులో క్షుద్ర పూజకుడుకి జీవిత ఖైదు పడింది. మానవ శరీర భాగాలు ఔషధాలుగా ఉపయోగపడతాయన్న నమ్మకంతో సిబొనాకలిసొ ఎంబిలి అనే వ్యక్తి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. క్షుద్రపూజల కోసం తనకు భారత మహిళ తల తీసుకురావాలని.. ఖుమాలో అనే వ్యక్తిని అతడు కోరాడు. అందుకు రూ.1కోటి చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఖుమాలో మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో.. డర్బన్‌ సమీపంలో భారత సంతతి మహిళ డెసిరీ మురుగన్‌ను హత్య చేశాడు. ఆ మహిళని 192 సార్లు పొడిచి.. నిందితులు ఆమె తలను శరీరం నుంచి వేరు చేశారు. నేరాన్ని అంగీకరించిన ఖుమాకి అక్కడి కోర్ట్ ఇప్పటికే జీవితఖైదు విధించింది. తాజాగా మిగతా నిందితులకు కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఎంబిలికి జీవితఖైదు.. మిగతా ఇద్దరు నిందితుల్లో ఒకరికి 15ఏళ్లు, మరొకరికి 12 ఏళ్లు జైలుశిక్ష విధించింది.

Comments