ప్రచురణ తేదీ : Sep 24, 2017 8:00 PM IST

నట విశ్వరూపం… జూనియర్ ఎన్టీఆర్! అతనొక్కడే!

తెలుగు సినిమాలో గొప్ప నటులు అని చెప్పుకుంటే అది వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత ఆ స్థాయిలో అన్ని ఎమోషన్స్ లో తన నటనా ప్రతిభ చూపించి గొప్ప నటుడు అనిపించుకే అర్హత ఎవరికైనా ఉందా అంటే ఎవరు కనిపించలేదు. అందుకే చాలా మంది ఒక విమర్శ చేస్తూ ఉంటారు. తెలుగు సినిమాలో స్టార్స్ ఉంటారు కాని నటులు ఉండరు. హీరోలు ఉంటారు కాని, పాత్రలు కనిపించవు. ఇది చాలా సందర్భాల్లో వినిపించిన మాట. కోటా శ్రీనివాసరావు వంటి గొప్ప నటులు ఉన్న వాళ్ళు సహాయక పాత్రలకే పరిమితం అయిపోయారు. మరి కథని నడిపించే కతానాయకలు అన్ని కలల్లో అద్బుతం అనిపించుకునే నటులు ఎవరైనా ఉన్నారా అంటే అందరికి ఒక క్వశ్చన్ మార్క్ పేస్. ఎందుకంటే తెలుగు సినిమా రంగంలో ఒక కమల్ హసన్ లేదు. ఒక విక్రమ్ లేడు. పాత్ర కోసం ఎంతటి కస్తానికైన సిద్ధపడే నటులు లేరు అనేది కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. అది ఒకప్పటి వరకు కాని ఇప్పుడు మారిపోయింది. మనకు ఒక నటుడు ఉన్నాడు. తన నట విశ్వరూపంతో అద్బుతం చేసిన కళాకారుడు ఉన్నాడు. అతడు ఒకే ఒక్కడు మన జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రేక్షకుడు వరకు జై లవకుశ సినిమా చూసిన తర్వాత ఒప్పుకోవాల్సిన విషయం.

ఎన్టీఆర్ అంటే ఒకప్పటి వరకు ఒకేరకమైన మూస పాత్రలు, ఒకే రకమైన డాన్స్ చేస్తూ ఉంటాడు. అతనిలో ఒక మంచి నటుడు ఉన్న అతన్ని స్టార్ అనే స్టేటస్ డామినేట్ చేసేస్తుంది అనేది చాలా మంది మాట. అది టెంపర్ సినిమాకి ముందు. ఎన్టీఆర్ లో టెంపర్ సినిమా మరో రూపం పరిచయం చేసింది. అందులో అవినీతికి అలవాటు పడిపోయిన పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ అద్బుతం అని చెప్పాలి. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అది కచ్చితంగా ఎన్టీఆర్ నటన వలెనే సాధ్యమైంది అనేది అందరి మాట. తరువాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ని డైలాగ్ చెప్పే విధానం, యాటిట్యూడ్ అంతా మార్చుకొని అందులో పాత్ర స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. అందుకే ఆ సినిమాలో కూడా తారక్ అనే ఒక నటుడుని ప్రేక్షకుడు ఎక్కడ చూడడు. ఇక జనతా గ్యారేజ్ సినిమాలో కూడా మొక్కలంటే ఇష్టపడే యువకుడు పాత్రలో ఒక సాఫ్ట్ స్వభావం చూపిస్తూ ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ గురించి ఎంత ఎక్కువ చెప్పిన తక్కువే అవుతుంది.
ఇక ఇప్పుడు జై లవకుశ. ఏకంగా మూడు పాత్రలు. అందులో స్వభావంలో ఒకదానితో ఒకటి ఎ మాత్రం పొంతన లేని పాత్రలు. ముగ్గురు మూడు రకాలుగా బిహేవ్ చేయాలి. ఆ వేరియేషన్ చూపించడంలో జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడు. సినిమా చూసిన ప్రేక్షకుడుకి తన నటనలో ఎక్కడ చిన్న వంక పెట్టడానికి కూడా అవకాశం లేకుండా, సినిమా చూస్తున్నంత సేపు అందులో ఆ మూడు పాత్రలు కనిపించే విధంగా మెప్పించడం ద్వారా సినిమా సక్సెస్ లో మేజర్ భాగం ఎన్టీఆర్ తీసుకుపోయాడు. ఒక మామూలు కథని కూడా ఎన్టీఅర్ తన నటనతో హిట్ చేయడం తెలుగు ఇండస్ట్రీలో ఇదే మొదటి సారి, చివరి సారి కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తదనంకి అలవాటు పడిన తెలుగు ప్రేక్షకుడు, స్టార్ హీరోల నుంచి కూడా మంచి నటన కోరుకుంటున్నాడు. అదే సమయంలో మంచి కథ కూడా కోరుకుంటున్నాడు. ఈ రెండు ఉంటేనే సినిమా హిట్ కేటగిరీలో చేరుతుంది. పాత్ర బాగుండి సినిమా బాగోలేకపోయినా, కథ బాగుండి, హీరో యాక్టింగ్ బాగోకపోయినా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో తన యాక్టింగ్ టాలెంట్ తో సినిమాని హిట్ చేసుకున్న ఏకైక స్టార్ హీరో కచ్చితంగా తారక్ అని అందరు ఒప్పుకోవాల్సిందే. అందుకే ఈ తార హీరోల్లో తారక్ ని నటుడుగా టాప్ చైర్ లో కూర్చోబెట్టడానికి ఎవరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు.

Comments