ప్రచురణ తేదీ : Dec 29, 2016 6:07 PM IST

611 పోస్టులు.. 5 నోటిఫికేషన్లు.. హైలెవ‌ల్ జాబ్స్‌..

appsc
డిగ్రీ లెక్చరర్‌ ఖాళీలు- 504.. వీటితో పాటే కాస్త పెద్ద లెవ‌ల్ జీతాల‌తో పెద్ద రేంజు పోస్టుల్ని భ‌ర్తీ చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం ఏకంగా ఐదు నోటిఫికేష‌న్లు జారీ చేయ‌నుంది. జనవరి 28 వరకు దరఖాస్తులు స్వీక‌రిస్తారు.

ప‌లు ప్రభుత్వ విభాగాల్లో 611 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఒకేసారి ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో 504 పోస్టులు డిగ్రీ లెక్చరర్లవే. శనివారం గ్రూప్‌-1, గ్రూప్‌-3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మరోవైపు… ట్రాన్స్‌కో, జెన్‌కోలలో 426 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి విద్యార్హతలతో సహా పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌ www.psc.ap.gov.in లో పెట్టింది. ఆయా నోటిఫికేషన్లకు గురువారం నుంచే (డిసెంబరు 29) దరఖాస్తు చేసుకోవచ్చు. తుది గడువు జనవరి 28.

* అన్ని పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* గ్రూప్‌-1, గ్రూప్‌-3 సర్వీసెస్‌ (పంచాయితీ కార్యదర్శులు) నోటిఫికేషన్లతోపాటు మరిన్ని ప్రకటనలను శనివారం విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.
* గ్రూప్‌-1లో సుమారు 90 పోస్టులు, గ్రూప్‌-3లో 1055 పోస్టులు ఉన్నాయి.
* ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలలో అసిస్టెంట్‌ ఇంజనీర్ల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. జెన్‌కోలో 228, ట్రాన్స్‌కోలో 198… మొత్తం 426 ఏఈ పోస్టులు భర్తీ కానున్నాయి.

Comments