ప్రచురణ తేదీ : Dec 27, 2016 11:57 AM IST

ఏపీ లో అమ్మాయిలకి రక్షణ లేదు .. నేరాలలో నెంబర్ 1 ఏపీ నే :

chandra-babu
ఆంధ్ర ప్రదేశ్ ని నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలి అనేది చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి ప్రపంచ పటం లో ఆ హైదరాబాద్ ని ఉంచిన ఘనత ఆయనదే అని చెప్పుకునే చంద్రబాబు గారు దేశం లోనే అగ్రగామిగా ఏపీ ని మారుస్తా అంటూ ఉంటారు ఎప్పుడూ. ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నారో కానీ.. అభివృద్ధిలో రోజురోజుకూ వెనక్కుపోతూ అవినీతిలో మాత్రం ఇప్పటికే ఏపీ నంబర్ 1గా నిలిచింది. తాజాగా మరో అంశంలోనూ నంబర్ 1 అయింది.. ఈసారి నేరాల్లో ఏపీకి నంబర్ 1 ప్లేస్ దక్కింది. అవును కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం ఏపీ లో అమ్మాయిలకి రక్షణ లేదట. నాల్గవ స్థానం లో అమ్మాయిల రక్షణ విషయం లో ఉంది ఏపీ రాష్ట్రం.నేరాల విషయంలో టీడీపీ దాని అనుకూల మీడియా పదేపదే రాయలసీమ మీద నిందలేస్తున్న నేపథ్యంలో… నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మాత్రం చంద్రబాబు రాజ్యమేలుతున్న విజయవాడలోనే క్రైమ్ రేటు అధికంగా ఉందని తేల్చింది. దేశంలోనే దళితులపై అత్యధిక స్థాయిలో దాడులు జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

Comments