ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

నితిన్ ప్రేమలో పడ్డాడు! అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ !

నిజమే .. హీరో నితిన్ ప్రస్తుతం ఘాటు ప్రేమాయణంలో ఉన్నాడని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా భారీ బడ్జెట్ తో నితిన్ హీరోగా వచ్చిన ”లై ” సినిమా భారీ డిస్సప్పాయింట్ చేసింది. అనుకున్న రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో నిరాశలో ఉన్న నితిన్ … ఈ సినిమాతో మంచి లవర్ ను మాత్రం పట్టేసాడని అంటున్నారు. ఇంతకీ నితిన్ ని లవ్ లో పడేసింది ఎవరో కాదు .. తాజాగా ”లై” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ ? అవునా అంటే అవుననే అంటున్నారు. పైగా మేఘ ఆకాష్ నెక్స్ట్ సినిమా కూడా నితిన్ తోనే చేస్తుంది. పవన్, త్రివిక్రమ్ ల బ్యానర్ లో నితిన్ హీరోగా నటించే సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా మేఘ ఆకాష్ హీరోయిన్ కావడంతో వీరిద్దరి ప్రేమాయణం ఇంకా జోరుగా సాగుతుందని టాక్ ? మొత్తానికి ఈ మలయాళీ భామ ప్రేమలో చిక్కుకున్నాడు నితిన్. మరి ఈ ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తోందా లేదా అనేది చూడాలి.

Comments