ప్రచురణ తేదీ : Jan 21, 2017 2:00 AM IST

అల్ట్రా మోడ్రన్ లుక్ లో జైలుకు వెళ్లిన యంగ్ హీరో..!

nithin1
యంగ్ హీరో నితిన్ జోరు టాలీవుడ్ లో మామూలుగా లేదు. నితిన్ చివరి చిత్రం ఆ..ఆ.. తో 50 కోట్ల క్లబ్ లో చేరి స్టార్ హీరోల సరసన చేరాడు. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఇటీవలే నితిన్ పట్టాలెక్కించాడు.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నితిన్ అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపిస్తున్నాడు.

కాగా నితిన్ నేడు చంచల్ గూడా జైలుకు వెళ్ళాడు.ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా నితిన్ జైలుకు వెళ్లాడు. చిత్ర యూనిట్ జైలులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. దీనితో జైలు ప్రాంగణం సందడిగా మారింది. నటులు పృథ్వి , బ్రహ్మాజీ, నితిన్ లపై కొన్ని సన్నివేశాలను జైలులో చిత్రీకరించారు.ఈ చిత్రం కోసం గుబురు గడ్డం పెంచిన నితిన్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ హీరో అర్జున్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Comments