ప్రచురణ తేదీ : Oct 13, 2017 10:45 AM IST

పవన్ హీరోయిన్ కి ఆ వాసనే పడదట..!!

కొమరం పులి చిత్రంలో పవన్ సరసన మెరిసింది నికిషా పటేల్. అందచందాల హీరోయిన్ గా గుర్తింపు తెచుకున్నప్పటికీ విజయాలు రాలేదు. తద్వారా అవకాశాలు కూడా తగ్గాయి. ఈ అమ్మడు ప్రస్తుతం కన్నడ మరియు తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

కాగా రీసెంట్ గా ఈ అమ్మడి ముందు ప్రేమ ప్రస్తావన తీసుకునివస్తే కాస్త డిఫరెంట్ గా స్పందించింది. ప్రేమ దోమా లాంటి వాసనలు తనకు పడవని తేల్చేసింది. తన జీవితం లో ప్రేమకు స్థానం లేదని తెలిపింది. తాను ప్రేమ వివాహం చేసుకోనని కచ్చితంగా తేల్చేసింది. నికిషా పటేల్ లాంటి హీరోయిన్ కు ప్రేమ పట్ల ఇలాంటి ఒపీనియన్ ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Comments