ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

ఆ విధంగా సంచలనం కానున్న పవన్ – త్రివిక్రమ్ సినిమా !

పవన్ – త్రివిక్రమ్ ల చిత్రం భారీ అంచనాలతో ముస్తాబవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షుకులని మెప్పించేలా దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజ్ఞాతవాసి అనే టైటిల్ దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలివుంది. కాగా ఈ చిత్రానికి ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాల్ని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో సినిమాలకు సోషల్ మీడియా ప్రధాన ప్రచార వేదికలుగా మారాయి. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల చిత్రానికి ట్విట్టర్ లో ఎమోజి ని ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. ఎమోజి ని రూపొందించుకున్న తొలి సౌత్ ఇండియన్ మూవీ గా విజయ మెర్సల్ రికార్డు క్రియేట్ చేసింది. ఆ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ చిత్రానికే ఈ ఘనత దక్కనుంది. కాగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడిగా కనిపిస్తాడు.

Comments