ప్రచురణ తేదీ : Dec 1, 2017 10:05 AM IST

2.30 కోట్ల‌ ఖ‌రీదైన కార్ హీరోగారి గ్యారేజీకి!!

కొంద‌రికి కార్ల పిచ్చి ఉంటుంది. అందులోనూ న‌చ్చిన బ్రాండ్ల లో అడ్వాన్స్‌డ్ వెర్ష‌న్‌ కొత్త‌గా మార్కెట్లో దిగితే మ‌న‌సు పీకేస్తుంది. గుండె ద‌డ పెరుగుతుంది. ఇదిగో ఈ కుర్ర హీరోకి అదే జ‌రిగింది. ఇప్ప‌టికే గ్యారేజీ నిండా డ‌జ‌న్ల కొద్దీ కార్లు త‌న కోసం వెయిటింగ్ చేస్తున్నా ఓ కొత్త కార్‌పై మోజు ప‌డ్డాడు. ఇంకేం ఉంది. ఆ కొత్త కార్ త‌న సొంత‌మైంది. గ్యారేజీలోకి వ‌చ్చి చేరింది. కారును, కారు కీస్‌ని స‌ద‌రు కంపెనీ వాళ్లు ఇంటికి తెచ్చి మ‌రీ ఇచ్చారు. అస‌లింతకీ ఎవ‌రా కుర్ర హీరో? అంటే ఓకే బంగారం దుల్కార్ అని మీకు ఈపాటికే అర్థ‌మై ఉంటుంది.

బిఎండ‌బ్ల్యూ ఎం3, పోలో జిటి, బిఎం డ‌బ్ల్యూ ఆర్‌1200జీఎస్‌, ట్రైఅంప్ బోనెవిల్లే.. ఇన్ని కార్లు గ్యారేజీలో ఉన్నా… రీసెంటుగా మార్చెట్లోకి వ‌చ్చి ట‌ర్బో కార్‌పై మ‌న‌సు పారేసుకున్న దుల్కార్ దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌నుకున్నాడు. ఇంకేం ఉంది ఆర్డ‌ర్ ఇచ్చేశాడు. ఇంటికొచ్చేసింది. కొత్త గా గ్యారేజీకి వ‌చ్చిన‌ ఖ‌రీదైన పోస్చ్ ప‌న‌మెరా ట‌ర్బో స్పోర్ట్స్ కార్ ఖ‌రీదు రెండున్న‌ర కోట్లు. 3.8 సెక‌న్ల‌లోనే 0-100 కి.మీల వేగంతో ర‌య్ మ‌ని దూసుకుపోతుంది.

Comments