ప్రచురణ తేదీ : Jan 10, 2018 11:20 AM IST

న్యూస్ పేపర్ లాగా మడతైపోయే టివి..సూపర్ హెచ్ డి తెలుసా..!

సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జి మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. సోమవారం ఈ సంస్థ 65 అంగుళాల భారీ 4కె ఓ ఎల్ ఈ డి టెలివిజన్ ని ఆవిష్కరించింది. సోమవారం జరిగిన సి ఈ ఎస్ ఈవెంట్ లో ఈ టెలివిజన్ గురించి డెమో ఇచ్చారు. కాగా 65 అంగుళాల భారీ టివి అంటే తీసుకుని వెళ్లడం, ఇంటిలో ఉపయోగించడం కష్టం అనుకుంటే పొరపాటే.

న్యూస్ పేపర్ ని మడతెట్టేసినంత ఈజీగా దీనిని ఉపయోగించవచ్చు. అవును.. ఈ టీవీ న్యూస్ పేపర్ తరహాలో మడతైపోతుంది. దీనివలన మీ ఇంట్లో దీనికోసం ఎక్కువ స్థలం కూడా కేటాయించనవసరం లేదు. టివి చూసే సమయంలో ఉపయోగించి. మిగిలిన సమయాల్లో మడతపెట్టి ఓ పక్కన దాచుకోవచ్చు. కాగా హెచ్ డి డిస్ ప్లే లో ఇదొక విప్లవం అని చెప్పొచ్చు. 4కె ఓఎల్ఈడీ(ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డిస్ ప్లే) డిస్ ప్లే ని ఇది కలిగి ఉంది. ఎల్సిడి టెలివిజన్ లకన్నా ఇందులో పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఈ టివి పనిచేసే విధానం ఈ క్రింది వీడియోలో గమనించవచ్చు.

Comments