ప్రచురణ తేదీ : Jul 23, 2018 1:16 PM IST

#NC17 లాంచ్ .. ఎందుకంత సీక్రెట్‌?

అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా #NC17 లాంచ్ అయ్యింది. `నిన్ను కోరి` ఫేం శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై హ‌రీష్ పెద్ది- సాము గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత‌న్య – స‌మంత జంట పెళ్లికి ముందు మూడు సినిమాల్లో జోడీగా న‌టించారు. ఏ మాయ చేశావే, ఆటో న‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాలు రిలీజ‌య్యాయి. వీటిలో ఆ జోడీ రొమాన్స్ గొప్ప‌గా పండింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం తొలి ప్ర‌య‌త్న‌మిదే.

చైత‌న్య కొత్త సినిమా #NC17 పూజా కార్య‌క్ర‌మాల్ని నేడు సైలెంటుగా పూర్తి చేయ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌కొచ్చింది. ఓవైపు చందు మొండేటితో స‌వ్య‌సాచి నిర్మాణానంత‌ర ప‌నుల్లో బిజీగా ఉన్న చైతూ, మ‌రోవైపు మారుతితో `శైల‌జారెడ్డి అల్లుడు` షూటింగ్‌ హ‌డావుడిలోనూ ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒక‌టి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. వేరొక‌టి రివెంజ్ రొమాన్స్ ల‌వ్ స్టోరి. అక్కినేని కాంపౌండ్ రీషూట్ల ప్ర‌ణాళిక‌తో ఇవి రెండూ ప‌క‌డ్భందీగా తెర‌కెక్కాయి. ఇక‌పోతే తాజాగా 17వ సినిమాపైనా చైతూ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉన్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి అక్కినేని బుల్లోడి కెరీర్ టేకాఫ్ పీక్స్‌లో ఉంద‌నే చెప్పొచ్చు.

Comments