ప్రచురణ తేదీ : Jan 25, 2017 5:16 PM IST

న‌యీమ్ ఎన్‌కౌంట‌ర్.. షూట్ ఫినిష్ చేస్తున్నారు!

pp
గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖ‌య్యుం భాయ్‌`. న‌యీమ్ పాత్ర‌లో క‌ట్టా రాంబాబు, ఏసీపీ పాత్ర‌లో తార‌క‌ర‌త్న న‌టిస్తున్నారు. భ‌ర‌త్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఫిబ్ర‌వ‌రి 5వ తేదికి షూటింగ్ పూర్తిచేసి గుమ్మ‌డికాయ కొట్ట‌డానికి రెడీ అవుతున్నారు.

ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ తాజా ప్రోగ్రెస్ గురించి వివ‌రిస్తూ- “హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి, మంగ‌ళ‌గిరి త‌దిత‌ర చోట్ల తొలి, మ‌లి షెడ్యూల్స్ పూర్తి చేశాం. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ లో సాగుతోంది. మూడు పాట‌లు షూటింగ్ కూడా పూర్త‌యింది. రేప‌టి నుంచి ( గురువారం) నుంచి నాల్గ‌వ పాట షూట్ ప్రారంభిస్తాం. సంగీత ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ చంద్ర అద్భుత‌మైన ట్యూన్స్ అందించారు. ఇప్ప‌టివ‌ర‌కూ షూట్ చేసిన పాట‌ల‌న్నీ బాగా వ‌చ్చాయి. సైమ‌ల్టేనియ‌స్‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. ఔట్‌పుట్‌ బాగా వ‌చ్చింది. తార‌క‌ర‌త్న పెర్పామెన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. క్వాలిటీ విష‌యంలో నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. 60 కోట్ల బ‌డ్జెట్ సినిమాలా క‌నిపిస్తుంది. గ‌తంలో నేను చేసిన సినిమాల‌న్నింకంటే రిచ్ గా సినిమా వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 5 త‌ర్వాత ఆడియో, నెలాఖ‌రున లేదా మార్చి లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం“ అని తెలిపారు.

Comments