ప్రచురణ తేదీ : Sep 13, 2018 1:37 PM IST

ఇప్పుడు నయనతారను అందుకోవడం కష్టమే ?

సౌత్ లో క్రేజీ గర్ల్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న నయనతార క్రేజ్ రోజు రోజుకు బాగా పెరుగుతుంది. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ సంచలనం రేపుతోంది. ఇప్పటికే నయనతార నటించిన కోలమవు కోకిల సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి క్రేజ్ ఇంకా రెట్టింపైంది. దాంతో వెంటనే తన పారితోషికాన్ని 3 కోట్లకు పెంచేసిందట. ఇప్పటి వరకు రెండు కోట్ల వరకు తీసుకునే ఈ అమ్మడు ఇలా ఒక్కసారిగా పారితోషికం పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. తెలుగులో మెగాస్టార్ సరసన సైరా సినిమాలో నటిస్తున్న నయనతార అటు అజిత్, కమల్ హాసన్ భారతీయుడు 2, లతో పాటు మరో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. నయనతార ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే మరోవైపు స్టార్ హీరోలతో జోడి కడుతూ తన సాటి హీరోయిన్స్ కు దడ పుట్టిస్తుంది.

Comments