ప్రచురణ తేదీ : Thu, Mar 1st, 2018

కేవైసీ ఇచ్చారా..? లేకపోతె మీ మొబైల్ వాలెట్ డబ్బుల పరిస్థితి అంతే..!

బ్యాంకులను వదిలి ఈ మధ్య ప్రజలు మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నరేంద్ర మోధీ వల్ల వచ్చిన ఈ డీ – మానిటైజేషన్ కారణంగా ఈ-వాలెట్ కి కుడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. పేటీఎం, మొబిక్విక్‌లాంటి వాలెట్లను షాపింగ్, బిల్ పేమెంట్, రీచార్జ్, మనీ ట్రాన్స్‌ఫర్‌కు బాగా వాడుతున్నారు. అయితే ఈ వాలెట్లకు కూడా ఫిబ్రవరి 28లోపు కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ డెడ్‌లైన్ గత సంవత్సరం డిసెంబర్ 31 వరకే ఉన్నా.. కొన్ని కారణాల వాళ్ళ ఆర్బీఐ దానిని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఇక పొడిగించకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేవైసీ వివరాలు ఇవ్వకపోతే వాలెట్‌లో ఉన్న డబ్బుల పరిస్థితి ఏమైపోతుందోనన్న ఆందోళన చాలా మందిలో కలిగింది. అయితే ఆ డబ్బుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో స్పష్టంచేశారు. అందులో ఉన్న డబ్బుతో గూడ్స్, సర్వీసెస్ కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. అయితే మనీ ట్రాన్స్‌ఫర్ లేదా లోడ్ చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని లేదంటే వాలెట్ లో ఎలాంటి మనీ లోడ్ చేయలేమని, కనీసం కుడా ట్రాన్స్‌ఫర్ చేయలేమని వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం 55 మొబైల్ వాలెట్లు పనిచేస్తున్నాయని. ఇవి కాకుండా బ్యాంకులకు సంబంధించి మరో 50 వాలెట్లు ఉన్నాయి. కేవైసీ వివరాల కింద కస్టమర్ తన ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్‌లాంటి వాటిని ఇవ్వొచ్చు అని తేల్చి చెప్పారు..

Comments