ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

గౌతమి పుత్ర శాతకర్ణి టాక్ వచ్చేసింది..సినిమా చూసింది ఎవరో తెలుసా..?

lokesh-bramini
బాలయ్య వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా 12 న విడుదలకు సిద్దమైపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఈ నేపథ్యం లో గౌతమి పుత్ర శాతకర్ణి ప్రీమియర్ షో ని నారాలోకేష్, బ్రహ్మీణి దంపతులు చూసారు. తాము అమరావతి లో ఈ చిత్రాన్ని చూసినట్లు వారు తెలిపారు.

శాతకర్ణి జీవిత చరిత్రని ఈ చిత్రం ద్వారా తనకు చూసే అవకాశం వచ్చిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. దర్శకుడు అద్భుతంగా తీసాడని ఆయన కొనియాడారు. బాలయ్య నటనతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని లోకేష్ అన్నారు. ఈ చిత్రం లో ఇతరనటీనటులను కూడా తప్పకుండా మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. మరో వైపు లోకేష్ భార్య నారా బ్రహ్మీణి కూడా ఈ చిత్రం పై తన స్పందనని తెలియజేసారు. ఈ చిత్రం చూశాక తనకు మాటలు రావడం లేదని దర్శకుడు క్రిష్ అద్భుతం తెరకెక్కించారని కొనియాడారు.

Comments