ప్రచురణ తేదీ : Sep 28, 2017 3:03 PM IST

స్టార్ డైరెక్టర్ తో నాని కొత్త మూవీ


ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో అందరికంటే ఎక్కువగా వరుస విజయాలను అందుకుంటున్న హీరో న్యాచురల్ స్టార్ నాని. 2015నుంచి నాని తీసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అంతే కాకుండా ప్రతి సినిమాకి బాక్స్ ఆఫీస్ రేంజ్ ను పెంచుకుంటూ.. మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరోగా గుర్తింపు పొందాడు. ఏ తరహా సినిమాలు వచ్చినా నాని ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. లవ్ స్టోరీస్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నాడు.

అంతే కాకుండా కథలను ఎంచుకోవడంలో కూడా నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిన్ను కోరి సినిమా తర్వాత రెండు సినిమాలను ఒకే చేశాడు. ఒకటి దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఎంసీఏ కాగా మరొకటి మేకపార్ల గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలను చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన కథని ఒకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ అక్కినేని అఖిల్ తో హలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సినిమాను మొదలు పెట్టాలనే ఆలోచనలో నాని ఉన్నాడని సమాచారం.

Comments