ప్రచురణ తేదీ : Fri, Aug 4th, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ : నక్షత్రం – టైటిల్ కు తగ్గట్టే చుక్కలు చూపించారు !

తెరపై కనిపించిన వారు : సందీప్ కిషన్, ధరమ్ తేజ్, రెజినా, ప్రగ్య జైస్వాల్

కెప్టెన్ ఆఫ్ ‘ నక్షత్రం’ : కరిష్మా వంశీ

మూల కథ :

రామారావు(సందీప్ కిషన్) పోలీస్ కుటుంబంలో పుట్టి తండ్రి స్ఫూర్తి తో తను కూడా పోలీస్ అవ్వాలని అనుకుంటాడు. అలా పోలీస్ కావడం కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా కమీషనర్ కొడుకు(తనీష్)తో గొడవ పడటంతో అతను రామారావుకు పోలీస్ ఉద్యోగం రాకుండా చేస్తాడు. ప్రజలని కాపాడే ప్రతి పౌరుడు పోలీస్ అని అతని తల్లి చెప్పిన మాటతో పోలీస్ యూనిఫామ్ వేసుకొని డ్యూటీ మొదలు పెడతాడు.

అయితే తాను వేసిన అలెగ్జాండర్ యూనిఫామ్ వలన అనుకోకుండా జరిగిన ఓ బాంబు బ్లాస్ట్ లో ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి అతని చుట్టూ వరుసగా సమస్యలు చుట్టుకుంటాయి. డీసీపీ అలెగ్జాండర్(సాయి ధరమ్ తేజ్) అసలు ఏమయ్యాడు? అతనికి సిటీ లో జరిగిన బాంబు బ్లాస్ట్స్ కి సంబంధం ఏమిటి? పోలీస్ కమీషనర్ కొడుకుతో రామారావుకి ఉన్న వైరం ఏమిటి? అనేది సినిమా కథ.

విజిల్ పోడు :

–> దర్శకుడు కృష్ణ వంశీ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంటుంది. అదే సినిమాకు ముఖ్య బలం. సరిగ్గా అనుకుంటే ఆ పాయింట్ చుట్టూ మంచి ఇంటెన్సిటీ ఉన్న కథను అల్లుకోవచ్చు. కాబట్టి ఈ స్టోరీ లైన్ కు మొదటి విజిల్ వేయొచ్చు.

–> కృష్ణ వంశీ ట్రేడ్ మార్క్ రొమాన్స్ ఈ సినిమాలో బాగా కనబడింది. హీరోయిన్లు రెజినా, ప్రగ్యా జైస్వాల్ లు స్క్రీన్ మీద అందంగా కనబడుతూ కనుల విందు చేశారు. కాబట్టి రెండో విజిల్ వాళ్లకు వేసుకోవచ్చు.

–> ఇక సహజంగా అనిపించే పాత్రలో సందీప్ కిషన్ నెగెటివ్ రోల్ లో తనీష్ ఆకట్టుకున్నాడు. మూడో వైజిల్ వీరిద్దరికీ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> కృష్ణ వంశీ మేకింగ్ సినిమాకు ప్రధాన లోతుగా కనబడింది. అదే పాత కాలపు ధోరణిలో ఆయన రాసుకున్న కథనం ఎక్కడా ఆకట్టుకోలేదు సరికదా కొన్ని చోట్ల చికాకుపెట్టింది కూడా.

–> సినిమాలో చాలా సన్నివేశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అతికించినట్టు ఉన్నాయి. పైగా చాలా చోట్ల లాజిక్స్ కూడా మిస్సయ్యాయి. తప్పక వివరణ ఇవ్వాల్సిన సీన్లకు కూడా ఉన్నట్టుండి ముగించేశాడు.

–> రెజీనా కేవలం ఆండాళ్ ప్రదర్శనకి పరిమితం కాగా మెగా హీరో ధరమ్ తేజ్ చేసిన అలెగ్జాండర్ పాత్ర కూడా బలంగా లేకపోవడంతో సినిమాను ముందుకు నడపలేకపోయింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఎంత కమర్షియల్ ఫార్మాట్ ను ఫాలో అయినప్పటికీ సన్నివేశాలకు లాజిక్స్ లేకపోవడం కొంత విచిత్రంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఎలా ఉందిరా నక్షత్రం ?
మిస్టర్ బి : టైటిల్ కు తగ్గట్టే చుక్కలు చూపించాడు కృష్ణ వంశీ.
మిస్టర్ ఏ : సేమ్ ఫీలింగ్ నాది కూడా.

Comments