ప్రచురణ తేదీ : Sat, Nov 21st, 2015

పెళ్లి తంతులో మటన్ చిచ్చు..!

mutton-issue
మనం పండగ ఎలా చేసుకుంటామో… పండగ కంటే ఎక్కువగా పెళ్లిని చేసుకుంటాం. ఎందుకంటే.. జీవితంలో పెళ్లి అన్నది ఒక్కసారే చేసుకుంటాం కాబట్టి. ముఖ్యంగా భారతదేశపు పెళ్ళిళ్ళలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇలా అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకోవడం అనాదిగా వస్తున్నది.

ఇక, ఇదిలా ఉంటే, ఈనెల 18 వ తేదీన శేరిలింగంపల్లిలోని సురభి కాలనీకి చెందిన మణికంఠ అనే యువకుని పెళ్లి.. బాచుపల్లిలోని మల్లంపేట కు చెందిన రజనీ అనే యువతితో జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు హాజరయ్యారు. పెళ్లిలో పెళ్లి భోజనం ఏర్పాటు చేశారు. అయితే, పెళ్లి భోజనంలో మటన్ వడ్డింపులో తేడా వచ్చింది. అబ్బాయి తరపు బంధువులలో ఒకరికి మటన్ సరిగా వడ్డించలేదట. అంటే, కోపం వచ్చిన సదరు వ్యక్తీ.. తినే ప్లేటును విసిరి కొట్టాడు. ఆ ప్లేట్ వెళ్లి.. అమ్మాయి బందువులకు తగిలింది. ఇరువైపు బంధువుల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. అయితే, పెద్దవాళ్ళు సర్ది చెప్పడంతో.. గొడవ సద్దుమణిగింది.

శుక్రవారం మధ్యాహ్నం మల్లంపేట నుంచి కొంతమది సురభీ కాలనీకి వచ్చి అబ్బాయి తరపు బంధువులపై దాడి చేశారు . ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు.

Comments