ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

‘ఖైదీ నంబర్ 150’ సినిమా చూసి మురుగదాస్ హర్ట్ అయ్యాడంట…?

murugadoss
దక్షిణ భారత దేశంలోనే పెద్ద దర్శకులలో ఒకడైన తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన ‘కత్తి’ మూవీ అక్కడ ఎన్నో రికార్డు లను క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వీ వీ వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఈ సినిమా మెగాస్టార్ కు 150వ సినిమా కావడంతో దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మించడం మరొక విశేషం. బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా చిరంజీవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అయితే ఈ సినిమా మాతృకకు దర్శకత్వం వహించిన మురుగదాస్ బుధవారం హైదరాబాదులో ఈ సినిమా చూసినట్టు సమాచారం. సినిమా అంతా బాగున్నప్పటికీ కొన్ని సీన్లు చూసి ఆయన ఫీల్ అయ్యారని సమాచారం. మురుగదాస్ సినిమాలలో మద్యానికి సంబందించిన సీన్లు దాదాపుగా ఉండవు. ఆయన సినిమాలలో విలన్లు కూడా టీ, కాఫీలే తాగుతారు. అలాంటిది ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో హీరోనే మద్యం తాగుతున్న సీన్లు ఆయనకు నచ్చలేదట. అలాగే ఆలీకి ఆడవేషం వేసి సృష్టించిన కామెడీ కూడా మురుగదాస్ కు నచ్చలేదని సమాచారం. మిగిలిన సినిమా అంతా చాలా బాగుందని మురుగదాస్ చెప్పారని అంటున్నారు.

Comments