ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

తెలంగాణా మంత్రి కొడుకు మర్డర్ చేశాడా..?

mantri-son
తెలంగాణ మంత్రి జోగురామన్న కుమారుడు హత్యకు పాల్పడ్డాడా ?ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జోగురామన్న కుమారుడు ప్రేమేందర్ పై హత్య కేసు నమోదైంది. జిలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరుపతి రెడ్డి ఈనెల 7 న అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తొలుత అతడిని ఆత్మహత్య అని అంతా భావించారు. కానీ ఆతరువాహత అతడు మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అతడిది ఆత్మహత్య కాదని, హత్యే అని అతడి గ్రామమైన లక్ష్మి పూర్ గ్రామస్తులు, అతడి బంధువులు భావిస్తున్నారు.

గ్రామం లో గత కొన్నేళ్లుగా రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయని, అందువలన ఇది ఖచ్చితంగా హత్యే అయి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యం లో తిరుపతి రెడ్డి మరణానికి కారణం గ్రామంలోని టిఆర్ ఎస్ నేతలతో పాటు మంత్రి జోగురామన్న కుమారుడు ప్రేమేందర్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి రెడ్డి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనితో పోలీస్ లు ప్రేమేందర్ పై హత్య కేసుని నమోదు చేశారు. ప్రేమేందర్ తోపాటు మరో 9 మంది టిఆర్ ఎస్ నేతల పై కూడా కేసు నమోదైంది.

Comments