ప్రచురణ తేదీ : Fri, Mar 16th, 2018

ఐపీఎల్ 11 టికెట్లు కావాలా..? సేల్స్ షురూ గురూ..

క్రికెట్ అభిమానులు ఎంత కలంనుంచో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 11 టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఐపీఎల్-11 క్రికెట్ పోటీల్లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటా పోటీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలకు కౌంటర్లు తెరచినట్లు ముంబయి ఫ్రాంఛైజీ వెల్లడించింది. క్రికెట్ అభిమానులు ఆన్‌లైన్లో www.mumbaiindians.com ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చని మీడియాకు ప్రకటించింది. టిక్కెట్ల ధరలు కనిష్ఠంగా రూ.800 నుంచి గరిష్ఠంగా 8,000 మధ్య వివిధ స్థాయిల్లో అమ్మకానికి ఉన్నాయి. సొంత మైదానంలో ముంబయి ఇండియన్స్ ఆడే మ్యాచ్‌ల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్ టిక్కెట్లను రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా అందరికీ విద్య-అందరికీ క్రీడలు ఉద్దేశంతో అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం రిజర్వ్ చేసినట్లు తెలిపింది. గతేడాది లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ను ఓడించి రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఐపీఎల్ మ్యాచ్ లు ఎలా సాగుతాయో వేచి చూడాల్సిందే.

Comments