ప్రచురణ తేదీ : Dec 29, 2016 6:05 PM IST

మ‌ళ్లీ గ‌ర్జించాల్సిందేనంటున్న‌ కాపు యూత్

mudragada-padmanadam
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కాపుల‌కు ఇచ్చిన మాట‌పై మ‌డం తిప్పేట‌ట్లు క‌నిపిస్తున్నార‌న్న‌ది కాపు యువ‌త ఫిర్యాదు. కాలం గ‌డుస్తోంది త‌ప్ప ప్ర‌భుత్వం ఇచ్చిన హామీపై ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు. మ‌రో రెండు రోజుల్లో ఏడాది పూర్త‌వుతుంది. కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్నాం. బాబు గ‌ద్దె ఎక్కిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ కాపుల‌కు చేసిందేమీ లేదు.. బీసీల్లో క‌లిపే ఆలోచ‌న క‌నిపించ‌డం లేదు. తూతూగా కాపుకార్పొరేష‌న్‌.. నిధులు అంటూ హ‌డావుడి చేస్తున్నారు త‌ప్ప రిజ‌ర్వేష‌న్ల మాటెత్త‌డం లేదు. వెన‌క్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యం అంటూ కాపు యూత్ భావిస్తోంది.

రాజ‌కీయ నాయ‌కులంతా ఒక‌రిపై ఒక‌రు బుర‌ద చ‌ల్లుకునే ప‌నిలో బిజీ అయిపోయారు. కాపుల ప‌క్షాన నిల‌బ‌డి పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పై తేదేపా సొంత చాన‌ళ్ల‌లో ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి కాపులు ఇచ్చిన అల్టిమేట‌మ్స్ కూడా ఎక్స్‌పైర్‌ అయిపోయాయి.

ఇక లాభం లేదు..చూస్తు కూర్చుంటో బాబు కాపుల చంకెక్కి కూర్చునేలా క‌నిపిస్తున్నాడు. అందుకే కాపులంతా మ‌ళ్లీ ఏకం కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని కాపు యువ‌త భావిస్తోంది. మ‌ళ్లీ దిక్కులు పిక్క‌టిల్లెలా..కాపులంతా క‌లిసిక‌ట్టుగా గ‌ర్జించాల్సిందేన‌ని కాపు యువ‌త రంగం సిద్ధం చేస్తోందిట‌. ఇప్ప‌టికే ఈ వేడి ప‌ల్లెటూరి నుంచి ప‌ట్ట‌ణం వ‌ర‌కూ తాకేసింది. ఈ దెబ్బ‌కు బాబు దిగిరావాల్సిందేన‌ని అంతా ప్లాన్ చేస్తున్నారు.

Comments