ప్రచురణ తేదీ : Jan 30, 2017 10:14 PM IST

కంపెనీతో గొడవ..కోర్టు మెట్లెక్కిన ధోని..!

dhoni
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోర్టు మెట్లెక్కాడు. ఓ మొబైల్ కంపెనీతో వివాదం చోటుచేసుకోవడంతో ఆ కంపెనీపై కోర్టు లో ఫిటిషన్ దాఖలు చేశాడు. బ్రాండ్ అంబాసిడర్ గా తనతో చేసుకున్న ఒప్పందం గడువు ముగిసినప్పటికీ ఆ కంపెనీ తన పేరు వాడుకుంటోందని ధోని ఢిల్లీ హై కోర్ట్ లో ఫిటిషన్ దాఖలు చేశాడు.మాక్స్ మొబిలింక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ధోని చేసుకున్న ఒప్పందం 2012 డిసెంబర్ నాటికి ముగిసింది. కాగా ఆ తరువాత కూడా కంపెనీ ధోని పేరుని వాడుతుండడంతో ధోని గతంలోనే కోర్టుకు వెళ్లాడు. 2016 ఏప్రిల్ లో కోర్టు ఆ కంపెనీకి ఉత్తర్వులు జారీ చేసింది.అయినా కూడా కంపెనీ కోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేదు. దీనితో ధోని మరో మారు కోర్టు మెట్లు ఎక్కడంతో కంపెనీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించింది.కోర్టు కంపెనీ ఉన్నతాధికారులను తొలగించాలని కోర్టు ఆదేశించింది. కాగా ధోని తరపున న్యాయవాది మాట్లాడుతూ 2012 లోనే కంపెనీతో ఒప్పందం ముగిసినప్పటికీ ధోని పేరుని వారి వాడుకుంటూ బకాయిలు చెల్లించడం లేదని అన్నారు.

Comments