ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

కొడుకు అని కూడా చూడకుండా ఏడాది పాటు బాత్రూమ్ లో బంధించింది

bathroom
కన్న తల్లి,తండ్రులే పిల్లలకు నరకం చూపిస్తే ఇంక ఆ పిల్లలు ఎవరితో చెప్పుకుంటారు. అమెరికాలో ఒక కసాయి తల్లి 12 ఏళ్ల తన కుమారుడిని ఒక సంవత్సరం పాటు బాత్రూంలో బందించి కొడుకని కూడా చూడకుండా ఆ పిల్లాడికి నరకం అంటే ఏంటో చూపించింది. ఆ సంఘటన తెలుసుకున్న అక్కడి ప్రజలు ఆమె మాతృత్వానికే ఒక మచ్చ లాంటిదని ఆమె వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. పశ్చిమ అమెరికాకు చెందిన ఉటా రాష్ట్రంలో బ్రాండీ కే జీన్స్(36) అనే మహిళకు ముగ్గురు పిల్లలు. ఈ మహిళ తన పన్నెండు సంవత్సరాల కుమారుడిని సంవత్సరం క్రితం ఇంట్లో ఉన్న బాత్రూమ్ లో బంధించి బయటనుండి తాళం వేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు తండ్రి వెంటనే ఇంటికివెళ్ళి కుమారుడిని రక్షించి ఆసుపత్రికి తరలించాడు.

సంవత్సరం నుండి సరైన తిండి, నిద్ర లేక ఆ బాలుడు చాలా సన్నగా అయిపోయాడని, ప్రస్తుతం 30 పౌండ్ల బరువు మాత్రమే ఉన్నాడని, కనీసం నిలబడ లేక పోతున్నాడని అతనిని పరీక్షించిన వైద్యులు చెప్తున్నారు. అతను కోలుకోవాలంటే చాలా వారాలు సమయం పడుతుందని వైద్యులు అన్నారు. అధికారులు విచారణ నిమిత్తం బ్రాండీ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు. బాలుడిని బంధించిన బాత్రూమ్ చాలా ఇరుకుగా, అసౌకర్యంగా ఉందని అంటున్నారు. సరైన వెలుతురు కూడా రాకుండా లోపల ఉన్న లైట్ మీద టేప్ అంటించినట్లు గుర్తించారు. బయటి నుండి లోపల దృశ్యాన్ని చూడడానికి, మాట్లాడడానికి ఒక కెమెరా కూడా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. తమ సోదరుడు ఏడాదిగా ఆ మురికి బాత్రూమ్ లోనే ఉన్నాడని, ఆరు నెలలుగా తమ సోదరుడితో కనీసం తలుపు దగ్గరనుండి కూడా మాట్లాడలేదని వారు వాపోతున్నారు. ఇంత దారుణమైన కేసును ఇంతకుముందెప్పుడు చూడలేదని, ఒక తల్లి అయి ఉండి ఆమె ఇలా చేసిందో విచారణలో తెలుస్తుందని అధికారులు అంటున్నారు.

Comments