ప్రచురణ తేదీ : Dec 4, 2017 10:42 AM IST

టాటూ వేయించుకొని చూపు కోల్పోయిన మోడల్

ప్రస్తుతం చాలా మంది ఫ్యాషన్ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా మోడల్స్ వారి అందాన్ని పెంచుకోవాలని, నలుగురిలో తాము ప్రత్యేకంగా కనిపించాలనే భావనతో సర్జరీలు టాటూలు వేయించుకుంటున్నారు. రీసెంట్ గా ఒక యువతీ టాటూను ఎక్కడ వేయించుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, తీరా అది ఫెయిల్ అవ్వడంతో ఆమె ఇప్పుడు నరకయాతన అనుభవిస్తోంది. వివరాల్లోకి వెళితే..కాట్ గాలింగర్ అనే మోడల్ అందరికంటే తాను డిఫెరెంట్ గా కనిపించాలని అనుకుంది.

అయితే ఓ టాటూ ఆర్టిస్ట్ ఆమె కనుగుడ్డులోని తెల్లని ప్రాంతాన్ని అందరిని ఆకర్షించే విధంగా చాలా అందంగా మారుస్తానని చెప్పడంతో కాట్ గాలింగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంత కాకుండా తనకు ఇష్టమైన పర్పుల్ కలర్ ని వేయమని చెప్పింది. దీంతో టాటూ ఆర్టిస్ట్ ‘స్క్లెరా’ పద్ధతిలో కనుగుడ్డును వంకాయ రంగులోకి మార్చాడు. మొదటి రోజు బాగానే ఉన్నా నెక్స్ట్ డే నుంచి నరకం కనిపించింది. కన్ను ఉబ్బిపోవడంతో రెప్పలు వేయడానికి రాలేదు. వైద్యులను సంప్రదించడంతో వారు కనుచూపు పోయే ప్రమాదం ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న గాలింగర్ చాలా బాధపడింది. తనలాగా మరెవ్వరు కాకూడదని సోషల్ మీడియాలో ఫొటోని పోస్ట్ చేసి మెసేజ్ ఇచ్చింది.

Comments