ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. ఓరుగ‌ల్లులో వ‌ర్గ‌పోరు..!

dayakar-vinay-baskar
ఓరుగ‌ల్లు వ‌ర్గ‌పోరుకు ఆలవాలం అయ్యింది. వరంగల్ నగరానికి చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్- వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయ‌ని అధికార తేరాస‌లో ముచ్చ‌టించుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

కొత్త సంవ‌త్స‌రం వేళ జ‌న‌వ‌రి 1న పసునూరి దయాకర్ పేరుతో వ‌రంగ‌ల్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కార్య‌క‌ర్త‌లు. అయితే దీనిని వినయ్ భాస్కర్ వ్య‌తిరేకించారు. ఈ త‌ప్పుకు ప్ర‌తిగా.. ద‌యాక‌ర్ జ‌రిమానా క‌ట్టాల్సొచ్చింది. దీంతో ఆ ఇద్ద‌రిమ‌ధ్యా ప‌రిణామాలేంటో అంద‌రికీ తెలిసొచ్చాయి. దయాకర్ కొండా సురేఖ వర్గం ఒక‌టిగా పోరుకు సిద్ధ‌మ‌వుతుంటే.. వారికి వ్య‌తిరేకంగా దయాకర్ పోరాటం సాగిస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు. సీనియ‌ర్‌ని జూనియ‌ర్ లెక్క జేయ‌డం లేద‌న్న ఈగో ఫీలింగ్స్ ఈ ఉదంతంతో బ‌య‌టికి వ‌చ్చాయి. మ‌రి ఈ ఇద్దరి వైఖ‌రిపై తేరాస అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Comments