ప్రచురణ తేదీ : Mon, Jul 17th, 2017

హద్దులు దాటిన ఎమ్మెల్యే, హీరోయిన్ ల వ్యవహారం..?

హీరో కళ్యాణ్ కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎమ్మెల్యే అనే చిత్ర్రంలో నటిస్తున్నాడు. వరుసగా ప్లాపులు ఎదురుకావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్ కొంచెం డల్ అయింది. ఎమ్మెల్యే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన ఉనికిని కాపాడుకోవాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. కాగా ఎమ్మెల్యే చిత్రం ప్రస్తుతం యమ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా ఫ్యాషన్ డిజైనర్ చిత్రంలో నటించిన మనాలి రాథోడ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్, మనాలి మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు హద్దులు మించే విధంగా ఉన్నాయని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

Comments