ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

లక్ష్మిస్ ఎన్టీఆర్ లో చేయడానికి సిద్ధమే..కానీ :ఎమ్మెల్యే రోజా

సీనియర్ ఎన్టీఆర్ జీవితం లోని కొన్ని ఘటనల ఆధారంగా ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తాను అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ నిన్న రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లో సినిమాను మొదలు పెట్టి అదే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేస్తానని చెప్పారు. ఇక సినిమాను వైసిపి నేత రాకేష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నిన్న వర్మ ఆయనను కలవడానికి కూడా వెళ్లారు. రాజకీయలను టార్గెట్ చేసి ఈ సినిమాలను తెరకెక్కించడం లేదని, కేవలం లక్ష్మీ పార్వతి ఎంట్రీ దగ్గరి నుంచి ఎండింగ్ వరకు సినిమా ఉంటుందని చెప్పారు.

అంతే కాకుండా ఈ సినిమాలో వైసీపి ఎమ్మెల్యే రోజాకి కూడా పాత్ర ఉంటుందా అని అడుగగా ఇంకా పాత్రల గురించి డిసైడ్ అవ్వలేదని తెలిపారు. అయితే రోజాకి ఇందులో ఒక క్యారెక్టర్ ఉందని రీసెంట్ గా వర్మ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయంపై రోజా స్పందించారు. ఆ సినిమాలో వర్మ మంచి పాత్ర ఇస్తే తప్పకుండా చేస్తానని సమాధానం ఇచ్చారు. ఇప్పటికే నిర్మాత రాకేష్ రెడ్డి వైసిపి నేత కావడం ఇప్పుడు రోజా కూడా సానుకూలంగా స్పందించడం చూస్తుంటే సినిమా భారీ స్థాయిలో రూపొందనుందని మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక అధికార పక్ష నేతలు ఇప్పటికే ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో వైసిపి నేతలు కూడా సినిమాలో భాగమై ఉండడంతో వివాదాలు ఏ స్థాయిలో చెలరేగుతాయో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Comments