ప్రచురణ తేదీ : Sun, Feb 12th, 2017

రాష్ట్ర మంత్రి కనపడ్డం లేదు … పోలీస్ స్టేషన్ లు ఆయన భార్య ఫిర్యాదు


ఏకంగా తమిళనాడు లో ఒక మంత్రే కనపడ్డం లేదు అంటూ ఆయన భార్య ఫిర్యాదు చేసింది. తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దురైకన్ను కనపడ్డం లేదు అనేది ఆయన భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు . ఆయన గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని, ఫోన్ సైతం స్విచ్చాఫ్ వస్తుండటంతో తమకు ఆందోళనగా ఉందని పాపనాశం పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దురైకన్ను శశికళ వర్గం నిర్వహిస్తున్న శిబిరంలో భాగంగా గోల్డెన్ బే రిసార్టులో ఉన్నారని కొందరు, ఆయన్ను ఏపీలోని ఓ రహస్య ప్రాంతానికి తరలించారని మరికొందరు భావిస్తున్నారు.

Comments