ప్రచురణ తేదీ : Dec 30, 2016 8:11 PM IST

సిస‌లైన తెలుగు గ‌డ్డ‌పై ఓవైసీల పెత్త‌నం.. టార్గెట్ బెజ‌వాడ‌!

MIM
ఓవైసీల పేరెత్తితే హైద‌రాబాద్ ఓల్డ్ సిటీ గుర్తుకు వ‌స్తుంది ఎవ‌రికైనా. అయితే ఇక‌ముందు ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పేరు ఏపీలోనూ మార్మోగిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎంఐఎం(మ‌జ్లిస్ ఇత్తెహ‌దుల్ ముస్లిమిన్‌) తెలంగాణ‌తో పాటు ఏపీ, బీహార్‌, మ‌హారాష్ట్ర వంటి చోట ప్రాప‌కం కోసం ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్లో పార్టిసిపేట్ చేస్తూ నెమ్మ‌ది నెమ్మ‌దిగా చొచ్చుకుపోతోంది.

అయితే ఏపీలో తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఎంఐఎం త‌న‌దైన మార్క్ రాజ‌కీయాల‌తో దూసుకుపోయేందుకు సిద్ధ‌మ‌వుతోందిట‌. అందుకు ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది. అందుకోసం పాత‌బ‌స్తీ గ్యాంగ్‌లు కొన్ని బెజ‌వాడ‌, గుంటూరు కేంద్రంగా స‌రికొత్తగా పావులు క‌దిపేందుకు ప్లాన్స్ వేస్తున్నారుట‌. తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలతో పాటు హైద‌రాబాద్ లోక్‌స‌భ స్థానం కూడా ఈ పార్టీ చేతిలో ఉంది. నిజామాబాద్ , కరీంనగర్, ఆదిలాబాద్ లోనూ విస్త‌రిస్తున్నారు. కౌన్సెల‌ర్లు, కార్పొరేట‌ర్ సీట్ల‌ను గెలుచుకుని చ‌క్రం తిప్పే వ్యూహంతో సాగుతున్నారు.
ఇక ఏపీలోని క‌ర్నూలులో ఎంఐఎంకు కొంత బ‌లం ఉన్న మాట వాస్త‌వం. ఏపీ రాజ‌ధాని ప్రాంతాలైన బెజ‌వాడ‌, గుంటూరు సిటీల్లోనూ ముస్లిమ్ ఓట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకోవ‌డం ద్వారా అక్క‌డ పాగా వేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ఆ రెండు న‌గ‌రాల్లో ముస్లిములు ఎక్కువ‌గా ఉన్న చోట త‌మ దృష్టి కేంద్రీక‌రించార‌ని తెలుస్తోంది. విజ‌య‌వాడ వ‌న్‌టౌన్, గుంటూరు తూర్పు, క‌ర్నూలు సీట్ల‌ను రాబోవు ఎన్నిక‌ల్లో త‌మ ఖాతాలో వేసుకునేందుకు ర‌ణ‌భేరి మోగించే ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నార‌న్న స‌మాచారం అందింది. ఇక ఏపీలో హ‌వా సాగించాలంటే తెలుగు నేర్చుకుని తెలుగులోనే మాట్లాడాల‌ని ప్లానింగులో ఉన్నారుట ఓవైసీలు. వార్నీ.. త‌స్స‌దియ్యో!

Comments