ప్రచురణ తేదీ : Sat, Sep 12th, 2015

భార్యను చంపి.. మెదడు తీసి పొట్టేలన్నాడు..?

blood-knife
కట్టుకున్న భార్యను మతిస్థిమితం లేని భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా.. భార్య మెదడును బయటకు తీసి, ఇంటి బయట కూర్చొని తాను పొట్టేలు ను కోసి కుప్పలు వేశానని చెప్పడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు లోపల చూసి ఆశ్చర్యపోయారు. లోపల చంద్రమ్మ రక్తపు మడుగులో పడుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసుల వివరాల ప్రకారం..

మహబూబ్ నగర్ జిల్లాలోని కోడేరు మండలం లోని ఎత్తం గ్రామానికి చెందిన బాలాస్వామి అనే వ్యక్తి, తన భార్య చంద్రమ్మతో కలిసి సింగపట్నంలో ఉన్న సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ కు వెళ్లి 40వేల రూపాయలను పంట రుణంగా తీసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చిన తరువాత మరి రాత్రి ఏమైందో తెలియదు కాని, భార్యను హత్య చేశాడని పోలీసులు చెప్తున్నారు. మతి స్థిమితం సరిగా లేకపోవడం వలనే అలా చేసుంటాడని ప్రజలు చెప్తున్నారు.

Comments