ప్రచురణ తేదీ : Dec 28, 2016 11:36 AM IST

మెగా క‌టౌట్ నింగిలో వీర‌విహారం..

mega
బాస్ నింగిలోకి దూసుకెళ్లారు. నింగిని తాకేలా ఖైదీ క‌టౌట్లు లేపారు మెగా ఫ్యాన్స్‌. ఒక‌ప్పుడు థియేట‌ర్ల ముందు భారీ క‌టౌట్లు క‌ట్ట‌డంలో ఫ్యాన్స్ హ‌డావుడి ఓ రేంజులో ఉండేది. అయితే అది రిలీజ్ స‌మ‌యంలో ఉండేది. జ‌స్ట్ నాలుగైదు రోజుల ముందు క‌టౌట్లు పెడుతూ హ‌డావుడి చేసేవారు. కానీ ఇప్పుడు మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన బూస్టింగ్‌తో అభిమానుల్లో అస‌లైన కోలాహాలం మొద‌లైంది. కనీసం 15 రోజుల ముందే.. ఆడియో అయినా రిలీజ్ కాక‌ముందే ఇలా క‌టౌట్లు క‌ట్టి మెగాఫ్యాన్స్‌ హ‌డావుడి చేస్తున్నారు.

దీన్నిబ‌ట్టి బాస్ రీఎంట్రీ ఫ్యాన్స్ లో ఎంత ఎన‌ర్జీ ఇచ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఏమాత్రం చెద‌ర‌ని అభిమానంతో ఫ్యాన్స్‌ ఎంత ఘ‌నంగా స్వ‌గ‌తిస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. జ‌న‌వ‌రి 4న ప్రిరీలీజ్ ఫంక్ష‌న్ అవ్వ‌కుండానే.. ఇంకా చాలా ముందే ఫ్యాన్స్ సంద‌డి చేయ‌డం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఆకాశం అంచును తాకేలా `ఖైదీనంబ‌ర్ 150` క‌టౌట్ పెట్టి సంద‌డి షురూ చేశారు ఫ్యాన్స్‌.

Comments