ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

అమెరికా మెగాఫ్యాన్స్ సూప‌ర‌హే.. కార్ల‌తో మెగా ర్యాలీ..

rally
ఫ్యాన్స్ యందు అమెరికా మెగా ఫ్యాన్స్ సూప‌ర‌యా.. విశ్వ‌ధాబిరామ వినుర వేమ‌!! అనాల్సిందే ఈ ఫీట్ చూస్తే.. బాస్‌కి అమెరికా -ఒహామా ఫ్యాన్స్ ఓ రేంజులో వెల్‌కం ట్రీటిచ్చారు.

మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు. `ఖైదీనంబ‌ర్- 150` చిత్రంతో ప్రేక్ష‌కాభిమానుల ముందుకు వ‌స్తున్నారు. ఇంకొన్ని గంట‌ల్లో బాస్ సంచ‌ల‌నాలు మొద‌ల‌వుతున్నాయి. బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టి.. తొలిరోజు రికార్డులకు బాస్ రెడీ అవుతున్నారు. అభిమానుల్లో ఒక‌టే క్యూరియాసిటీ. ఇప్ప‌టికే థియేట‌ర్ల ముందు ఫ్యాన్స్ సంద‌డి నెల‌కొంది. భారీ క‌టౌట్లు, మార్గం వెంబ‌డి ఆడియెన్‌కి గ్రాండ్ వెల్‌కం చెబుతూ ఫ్లెక్సీలు సంద‌డి చేస్తున్నాయి.

అయితే ఇదంతా రొటీన్ అనుకున్నారేమో.. బాస్‌కి వెల్‌కం చెబుతూ అమెరికా- ఒమ‌హా ఫ్యాన్స్ వినూత్న ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. అమెరికా- ఒమాహాలో ప‌దుల సంఖ్య‌లో కార్ల‌తో మెగా ఫ్యాన్స్ మెగా ర్యాలీని చేప‌ట్టారు. అంతేకాదు .. కార్ల‌తోనే చిరుకి వెల్‌కం చెబుతూ సింబ‌ల్‌ని ప్ర‌ద‌ర్శించారు. చిరు నామ‌ధేయం కార్ల రూపంలో చూపించి విల‌క్ష‌ణ‌త చాటుకున్నారు ఫ్యాన్స్‌. మెగా ఫ్యాన్స్‌లో బాస్‌పై ఉన్న అభిమానం ఎప్ప‌టికీ చిర‌స్థాయిగా నిలుస్తుంద‌న‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ అక్క‌ర్లేదేమో?

Comments