ప్రచురణ తేదీ : Nov 5, 2017 1:38 PM IST

రంగస్థలం 1985 నాన్ను వెంటాడుతోంది.. మనోజ్ హాట్ కామెంట్స్

రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం రంగస్థలం 1985. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ తారలు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అయితే రీసెంట్ గా మంచు మనోజ్ రంగస్థలం 1985పై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొన్ని కామెంట్స్ చేశాడు. ఇటీవల సోదరుడు రామ్ చరణ్ నాకు రంగస్థలం పాటలను వినిపించాడు. పాటలు ఛాయా బావున్నాయి. అవి నన్ను వెంటాడుతున్నాయి. సినిమా విడుదల కోసం వెయిట్ చేయలేకపోతున్నా.. వెంటనే సినిమాను విడుదల చెయ్యాలని ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు మనోజ్ చేసిన ట్వీట్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ఒక్కడు మిగిలాడు ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Comments