ప్రచురణ తేదీ : Dec 30, 2016 11:08 AM IST

మంచు హీరో కోసం … ఆస్ట్రేలియన్ ఐటెం పాప ?

vishnu
ఇండియన్ సినిమాలో వెలగాలనే కోరికా ఈ మధ్య హాలీవుడ్ పాపలకు బాగా ఇంట్రెస్ట్ కలిగినట్టుంది. అందుకే వెనకా ముందు ఆలోచించకుండా ఇక్కడికి ముటా ముల్లె సర్దుకుని వచ్చేస్తున్నారు. ఇప్పటికే హిందీతో పాటు సౌత్ లో కూడా గ్లామర్ భామలుగా చలామణి అవుతున్న అమీ జాక్సన్, స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, ఫరహా కరిమి లాంటి భామలు తనదైన గ్లామర్తో ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇక వీరి కోవలో మరో గ్లామర్ భామ ఎంట్రీ ఇస్తుంది ? ఆమె ఎవరో కాదు ఆస్ట్రేలియన్ ఐటెం పాపగా ఇమేజ్ తెచ్చుకున్న యోగ టీచర్ లూసిన్ద నికోలస్ ?ఈ మద్యే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన బాస్ సినిమాతో ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు మంచు విష్ణు సరసన ఓ ఐటెం సాంగ్ చేయనుంది? మంచు విష్ణు హీరోగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న లక్కున్నోడు చిత్రంలో ఈ భామ ఐటెం సాంగ్ చేయనుంది. త్వరలోనే ఈ సాంగ్ చిత్రీకరణ జరపనున్నారు. మరి లుసిన్ద అందాలు .. లక్కున్నోడు చిత్రంతో పండగ చేయనున్నాయన్నమాట !!

Comments