ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

అభినవ గాంధీ మా కేసీఆర్ అంటున్న మంచు మనోజ్! అందుకేనా?


తెలంగాణ ముఖ్యమంత్రి ని గాంధీ తో పోలుస్తూ .. హీరో మంచు మనోజ్ ట్విట్ చేసాడు. తాజాగా ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగ్గా బోదించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడంతో మనోజ్ ఆయనకు అభినందంలు తెలిపాడు మంచు మనోజ్. అంతే కాకుండా ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని అయన ఆదేశించారు. ఈ విషయంలో కేసీఆర్ మన తెలంగాణ గాంధీ అంటూ అభివర్ణించారు. ”మన తెలుగు భాషను పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టు గా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం హర్షణీయం అంటూ అంతటా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

Comments