ప్రచురణ తేదీ : Fri, Jan 12th, 2018

చెప్పుకు కెమెరా పెట్టి ఏం చేశాడో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో కొంత మంది వ్యవహరిస్తున్న తీరుకు మహిళలు ఎంతో సతమతమవుతున్నారు. డైరెక్ట్ గానే కాకుండా దొంగతనంతో టెక్నాలిజీని ఉపయోగించుకొని వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలకు తెలియకుండా పోటోలను వీడియోలను తీసి వంచనకు దిగుతున్నారు. అంతే కాకుండా మార్ఫింగ్ చేసి మరి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. అయితే ఈ తరహా ఘటనలు ఎక్కువయిపోతున్నాయి అనుకుంటున్న తరుణంలో ఈ మధ్య మరొక సమస్య ఆడవాళ్లను భయానికి గురి చేస్తోంది.

రీసెంట్ గా కేరళలో అలంటి ఘటనే ఒకటి సంచలనం సృష్టించింది. చెప్పులో చిన్న కెమెరాను పెట్టుకొని ఒక వ్యక్తి మహిళల పక్కకు నిలబడి అసభ్యంగా షూట్ చేస్తూ దొరికాడు. వివరాల్లోకి వెళితే.. బైజు అనే వ్యక్తి త్రిశూర్‌ జిల్లాలోని కాలోల్సావం అనే ప్రాంతంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్నాడు. అయితే అతను తన చెప్పులో సీక్రెట్ కెమెరాను పెట్టి స్కర్ట్స్‌ వేసుకున్న మహిళల దగ్గరికి వెళుతుండేవాడు. అంతే కాకుండా చెప్పులను వారు నిలుచున్నా చోటే వదిలేసి వచ్చేవాడు. ఇక గుంపులో కూడా చెప్పును అటు ఇటు జరుపుతు వచ్చాడు. అయితే సమీపంలో ఉన్న పోలీసులు అతని తీరును గమనించి చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Comments