ప్రచురణ తేదీ : Fri, Dec 8th, 2017

హిట్టా లేక ఫట్టా : మళ్ళీ రావా ట్రెండీ టాక్ !

అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో సుమంత్ విజయం రుచి చూసి చాలా కాలం అయింది. సుమంత్ ఇక హీరోగా నిలదొక్కుకుంటాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాంటి తరుణంలో సుమంత్ మళ్ళీ రావా చిత్రంతో ఇంకోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుమంత్ సరసన ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించింది. గౌతమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించిందా లేదా ఇప్పుడు చూద్దాం.

సుమంత్ చిత్రం నరుడా డోనారుడా. ప్రయోగాత్మకంగా వచ్చిన ఆ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఈ సారి సుమంత్ అటువంటి ప్రయోగాల జోలికి పోకుండా సింపుల్ గా ఉండే లవ్ స్టోరీని ఎంచుకుని మంచి పనిచేశాడు. ఈ చిత్రానికి ఇదే ఫస్ట్ ఫ్లస్ పాయింట్. కథ సింపుల్ గా ఉన్నా దర్శకుడు స్క్రీన్ ప్లే తో నడిపిన విధానం బావుంది. సుమంత్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు దక్కుతున్నాయి. సుమంత్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోగా, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కు తొలి చిత్రమే అయినా తన లుక్స్ తో మెప్పించింది. అక్కడక్కడా ఉండే కొన్ని బోరింగ్ సీన్స్ మినహా ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

మళ్ళీ చూసేలా ఉంది

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

మళ్ళీ రావా.. మనసులోకి ఎక్కుతుంది.. కానీ నెమ్మదిగా!

Reviewed By tupaki.com |Rating : 2.75/5

ఆకట్టుకునే సందర్భాలు కొన్ని మాత్రమే

Reviewed By mirchi9.com |Rating : 2.25/5

మళ్ళీ అదే ప్రేమ!

Reviewed By greatandhra.com |Rating : 2.75/5

ఫీల్ గుడ్ రొమాన్స్

Reviewed By gulte.com |Rating : 3/5 

Comments