ప్రచురణ తేదీ : Sep 28, 2017 12:50 PM IST

మహేష్ ఫాన్స్ హంగామా … థియేటర్ని తగలబెట్టారు ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే బెనిఫిట్ షో లతో లాభం పొందాలనుకున్న వారికి ఫాన్స్ షాకిచ్చారు. గతంలో కూడా తిరుపతిలో ఓ హీరో ఫాన్స్ ఓ థియేటర్ ని ద్వాంసం చేసారు.
తాజాగా గుంటూరు జిల్లా వినుకొండ లో మహేష్ ఫాన్స్ హంగామా క్రియేట్ చేసారు .. ఓ థియేటర్ ని ద్వాంసం చేయడమే కాకుండా నిప్పుకూడా పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే .. మహేష్ స్పైడర్ సినిమా బెనిఫిట్ షో వేసి లాభపడాలని అనుకున్న ఓ థియేటర్ యాజమాన్యం నిన్న ఉదయం 6 గంటలకే బెనిఫిట్ షో అని చెప్పి జోరుగా టికెట్స్ అమ్మేసారు .. ఒక్కో టికెట్ ఖరీదు 500 వసూలు చేశారట. అయితే విడుదల రోజు 5 గంటలకే అక్కడికి చేరుకున్న మహేష్ ఫాన్స్ తమ హీరో సినిమా ముందే చూడాలని తెగ కలలు కన్నారు, కానీ థియేటర్ కు ప్రింట్ రాకపోవడంతో 10 గంటలకు షో వేస్తామని యాజమాన్యం చెప్పడంతో ఫాన్స్ చెలరేగిపోయారు .. మమ్మల్ని మోసం చేస్తారా అంటూ థియేటర్ పై విరుచుకు పడ్డారు .. ఫర్నిచర్ విరగ్గొట్టి .. నిప్పు పెట్టారు ? దాంతో థియేటర్ బాగా దెబ్బతిన్నదట .. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారట ? అది విషయం.

Comments