ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

ఆ సాహసం అవసరమా బన్నీ..!!

ఉన్న మార్కెట్ ని వదిలేసి లేని మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న టాలీవుడ్ హీరోలు చేతులు కాల్చుకుంటున్నారు. ద్విభాషా చిత్రాల పేరుతో మితిమీరిన బడ్జెట్ లో చిత్రాలని నిర్మిస్తున్నారు. తీరా ఫలితం తేడా కొట్టాక అవి బోల్తా పడుతున్నాయి. దసరాకి విడుదలైన మహేష్ స్పైడర్ చిత్ర ఫలితం ఆశాజనకంగా లేదు. తమిళ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో తమిళ తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. డివైడ్ టాక్ ఫలితంగా ఈ చిత్రం నష్టాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా మహేష్ తమిళ చిత్ర సీమలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. తమిళం లో కూడా మార్కెట్ పెంచుకోవాలన్న మహేష్ ఆశలు ఫలించలేదు.

మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో బన్నీ నటించాల్సి ఉంది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం. బన్నీ లింగుస్వామి దర్శకత్వంలో తప్పకుండా నటిస్తాడట. ఈ చిత్రం ద్వారా తమిళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు బన్నీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బన్నీకి ఇప్పటికే మలయాళం లో మంచి క్రేజ్ ఉంది. దీనిని కోలీవుడ్ లో కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ కు బెడిసి కొట్టిన ఈ ప్రయత్నం బన్నీకి ఎటువంటి రిజల్ట్ ని ఇస్తుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Comments