ప్రచురణ తేదీ : Jan 22, 2017 1:37 PM IST

నా శక్తీ – వెలుగు ఆమె – మహేష్ చెప్పిన పుట్టినరోజు విశేష్

MAHESH-NAMRATHA
సూపర్ స్టార్ మహేష్ బాబు – ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ని బెస్ట్ కపుల్ గా చెప్పుకుంటారు ఆయన అభిమానులు. తరచూ మీడియా లో ఫోటోలు షేర్ చేస్తూ ఫామిలీ టూర్స్ తో బెస్ట్ డాడ్ గా పిలిపించుకునే మహేష్ బాబు తనకి సంబంధించిన ప్రతీ విషయాన్నీ నమ్రత ద్వారానే పూర్తి చేస్తాడు. ఇవాళ స్వయంగా మహేష్ తన భార్య సమ్మోహనంగా నవ్వుతున్న ఒక ఫోటో ని ఇంటర్నెట్ లో షేర్ చేసాడు. ఆమె పుట్టినరోజు ఇవాళే కావడం తో మహేష్ ఈ ఫోటోని పెట్టి ‘నా జీవితంలో శక్తి.. వెలుగు.. నా భార్య. హ్యాపీ బర్త్ డే టు డియరెస్ట్ వైఫ్’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్ బాబు. అవినాష్ గోవార్కర్ తీసిన ఓ ఫోటోలో మహేష్ వైఫ్ నమ్రత.. నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా ఉంది.

Comments