ప్రచురణ తేదీ : Sep 25, 2017 1:04 PM IST

బాబు మహేశ్… స్పైడర్ గురించి ఆ మాటేదో ఇక్కడ చెప్పొచ్చుగా?


మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒకే సారి మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగునాట మహేశ్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. అయితే ఎందుకనో ఈ సినిమా తమిళ ప్రమోషన్ కి ఇచ్చినంత ప్రయారిటీ తెలుగులో ఇవ్వడం లేదు. ఆ మధ్య మీడియా చానల్ అందరికి ఒకేసారి ఇంటర్వ్యూ ఇచ్చిన మహేశ్ తర్వాత సినిమా ప్రమోషన్ పూర్తిగా గాలికి వదిలేసాడు. అయితే తమిళనాట మాత్రం ప్రమోషన్ మీద ప్రత్యెక శ్రద్ధ పెట్టారు. చిత్ర యూనిట్ మొత్తం ఎప్పటికప్పుడు అక్కడ ప్రమోషన్ భాగా జరిగేలా చూసుకుంటున్నారు. అక్కడ పెద్ద హీరోలతో సమానంగా ఈ సినిమాని రిలీజ్ చేయడంతో పాటు మహేశ్ క్రేజ్ ని అక్కడ కూడా మార్కెట్ చేయాలని ఆలోచనతో తమిళ వెర్షన్ పై ప్రత్యెక శ్రద్ధ చూపించారు.

అయితే ఈ ప్రమోషన్ తమిళ వెర్షన్ వరకు ఒకే అనిపించుకున్న తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి సినిమా గురించి ఎలాంటి హైప్ జనాలకి లేకపోవడం మహేశ్ కెరియర్ లో ఫస్ట్ టైం జరుగుతుంది. డైరెక్టర్ అయితే తెలుగు వెర్షన్ మీద అసలు ద్రుష్టి కూడా పెట్టలేదు. కనీసం సినిమా గురించి, మహేశ్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మొదటి సారి మహేశ్ సినిమా ఏదో తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్నట్లు స్పైడర్ రిలీజ్ రెడీ అయ్యింది. ఇంకా చెప్పాలంటే అప్పట్లో మురగదాస్ డైరెక్షన్ లో వచ్చిన్ తుపాకి సినిమా కి ఉన్న క్రేజ్ కూడా స్పైడర్ కి లేకపోవడం ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ కాస్తా ఆందోళనతో ఉన్నారు. ట్రైలర్ అసలుకే ఆకట్టుకోలేదు. ఆపై ట్రైలర్ బట్టి సినిమా క్లాస్ మూవీ తరహాలో ఉంది. కాస్తా హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బీ, సి సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే ఎంతో కొంత ప్రమోషన్ ఉండాలి. కాని చిత్ర యూనిట్ మాత్రం దానిపై అసలు శ్రద్ధ చూపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో స్పైడర్ సినిమా ఎ తీరాలకి చేరుతుందో చూడాలి.

Comments