ప్రచురణ తేదీ : Sep 26, 2017 4:56 PM IST

అక్కడ మహేష్ కంటే పవన్ ఒకమెట్టు పైనే ?


సాధారణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ ప్రతి సారి జరిగేదే. ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే చాలు నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఒక వేళ గత చిత్రాలు అపజయం లో ఉన్నా సరే కొందరి హీరోల సినిమాలకు భారీ స్థాయిలో అంచనాలు అలుముకుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే యుఎస్ ఓవర్సీస్ మార్కెట్ లో పవన్ కళ్యాణ్ – మహేష్ సినిమాలు భారీ మొత్తంలో అమ్ముడు పోవడానికి సిద్ధమయ్యాయి. మహేష్ స్పైడర్ విషయాన్ని పక్కనపెడితే.. అతడు నెక్స్ట్ తీయబోయే భారత్ అనే నేను సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తవ్వకముందే యుఎస్ భారీ డిస్ట్రిబ్యూషన్ రేట్స్ ను అందుకోనుందట. ఎందుకంటే కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన శ్రీమంతుడు మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ అనే నేను కూడా మొత్తంగా రూ.18.18 కోట్ల ధరను పలికిందని అగ్రిమెంట్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఇక మహేష్ కంటే ఒక మెట్టు ఒక్కువగా పవన్ సినిమా అమ్ముడుపోతుందని ట్రేడ్ అనలిస్ట్ లు భావిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ తన 25వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రూ.19.19 కోట్లకు అమ్ముడుపోనుంది. మహేష్ – పవన్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. మరి ఈ రెండు సినిమాలు ఈ స్థాయిలో అమ్ముడు పోయాయంటే తప్పకుండా 5 మిలియన్ల డాలర్లు దాటితేనే బయ్యర్స్ కి లాభాలు అందుతాయి. మరి ఈ ఇద్దరి స్టార్స్ లో ఎవరు ఎక్కువ డాలర్లను అందిస్తారో చూడాలి.

Comments