ప్రచురణ తేదీ : Tue, Aug 8th, 2017

ధోని పై సెటైర్ వేసిన మాజీ ఆటగాడు.. వైరల్ అవుతున్న ట్వీట్

సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచం లో ఉన్న ప్రతి సెలబ్రెటీ అభిమానులతో వారి ఆనందాన్ని ఈజీగా షేర్ చేసుకుంటున్నారు. వారికి కలిగిన ఆలోచనను, గాని అనుభూతుని గాని వారి తరహాలో కామెంట్ చేస్తూ నెటిజన్లకు మరింత దగ్గరవుతున్నారు. కానీ ఒక్కోసారి ఆ కామెంట్స్ వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి. రీసెంట్ ఆలాంటి తరహాలోనే ఓ మాజీ ఆటగాడట చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీలంక మాజీ క్రికెటర్ అహేలా జయవర్దనే ధోనీపై కామెంట్ చేసి భారత అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాడు. లండన్ లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో 100 మీటర్ల రేసులో బోల్ట్ కాంస్య పతకాన్ని గెలిచాడు. అయితే అతనిపై కొందరు విమర్శలు చేయడంతో బోల్ట్ ని గౌరవించండని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు జయవర్ధనే. దీంతో ఓ భారత అభిమాని బోల్ట్ కంటే స్పీడ్ గా పరిగెత్తే ధోనిని కూడా గౌరవించండని కామెంట్ చేశాడు. ఇక అది చుసిన జయవర్ధనేకు ఏమనిపించిందో ఏమో గాని” ధోని బైక్ మీద వెళ్లి బోల్ట్ వేగాన్ని అధికమిస్తాడా” అని కామెంట్ చేయడంతో కొందరు ధోని ఫ్యాన్స్ జయవర్దనేపై ఆగ్రహంతో కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్ పై ధోని స్పందిస్తాడో లేదో చూడాలి.

Comments